Radheshyam: ప్రభాస్ 20వ చిత్రం టైటిల్ ఇదేనట!

Prabhas 20th Movie Tittle Radheshyam

  • రాధేశ్యామ్ టైటిల్ ఖరారు
  • వెల్లడించిన ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం
  • హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే

'సాహో' తరువాత ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా దాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న చిత్రానికి 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 20వ చిత్రం. ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ, ట్రేడ్ అనలిస్ట్ శివ సత్యం, తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయిన ప్రభాస్ అభిమానులు 'రాధేశ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News