Nitin: సీఎం కేసీఆర్ ను పెళ్లికి ఆహ్వానించిన హీరో నితిన్
- జూలై 26న నితిన్ పెళ్లి
- షాలినీతో నితిన్ వివాహం
- కరోనా వ్యాప్తి కారణంగా ఆలస్యమైన పరిణయం
హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడవుతున్నాడు. ఈ నెల 26న నితిన్, షాలినీలకు వివాహం హైదరాబాదులో జరగనుంది. ఈ నేపథ్యంలో, నితిన్ తన పెళ్లికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాడు. తన సన్నిహితులతో కలిసి ప్రగతిభవన్ కు వెళ్లిన నితిన్.. సీఎంను కలిసి శుభలేఖను అందించాడు. ఈ సందర్భంగా నితిన్ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నితిన్ పెళ్లి పనులు ప్రారంభమైనా, కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి ఆలస్యమైంది. వాస్తవానికి నితిన్, షాలిని పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సి ఉంది. భారీస్థాయిలో ఈ వివాహ మహోత్సవం నిర్వహించాలని ఇరుకుటుంబాల వారు నిశ్చయించినా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓ మోస్తరు వేడుక మాత్రమే జరపాలని భావిస్తున్నారు.