Sushant Singh Rajput: సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఒప్పుకున్న కేంద్రం
- సుశాంత్ మరణంపై వ్యక్తమవుతున్న పలు అనుమానాలు
- సీబీఐ చేత విచారణ జరిపించాలన్న బీహార్ ప్రభుత్వం
- సీబీఐకి అప్పగిస్తున్నామని సుప్రీంకు తెలిపిన కేంద్రం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావని... ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ జరిపించాలంటూ కేంద్రానికి సూచించింది. దీంతో, సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.