Nagababu: కుమార్తెలు నీటిపై మన ప్రతిబింబాల వంటివారు: నాగబాబు
- పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకరు
- వారిని వారిగానే ఉండనిద్దాం
- ట్విట్టర్ లో నాగబాబు
కుమార్తెలు నీటిపై కనిపించే మన ప్రతిబింబాల వంటి వారని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. నిన్న తన కుమార్తె నీహారిక నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించిన ఆయన, తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "కుమార్తెలు నీటిపై మన ప్రతిబింబాల వంటి వారు. ఆ రూపాన్ని పట్టుకోవాలని ఎంత బలంగా ప్రయత్నిస్తే, అన్ని తరంగాలు పుడుతుంటాయి. కాబట్టి, వారిని వారిగానే ఉండనిద్దాం. వారి జీవితంలోని ప్రతి వేడుక, వారి ఎదుగుదలను గుర్తు చేస్తుంటుంది. లవ్ యూ నీహా" అని పోస్ట్ చేశారు.