Rhea Chakravarthi: జూన్ 8 తరువాత సుశాంత్ ఇంటికి వెళ్లలేదంటున్న రియా... వెళ్లిందనడానికి సాక్ష్యం ఈ ఫొటోనే అంటున్న ఫ్యాన్స్!

New Twist in Sushant Sucide Case and Rhea Whereabouts on June 12
  • జూన్ 12న సుశాంత్ ఇంట్లోనే రియా
  • వెనకున్న కిటికీలు, రంగును చూసి కనిపెట్టిన ఫ్యాన్స్
  • మరోసారి సామాజిక మాధ్యమాల్లో రియాపై ట్రోలింగ్
ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నటి రియా చక్రవర్తిపై విచారణ జరుగుతున్న వేళ, ఆమె కొత్త ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జూన్ 8 తరువాత తాను సుశాంత్ ఇంటికే వెళ్లలేదని రియా చక్రవర్తి తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుశాంత్ తన ప్రాణాలను తీసుకోవడానికి రెండు రోజుల ముందు... అంటే, జూన్ 12న రియా ఆయన ఇంట్లోనే ఉందనడానికి ఈ ఫొటోయే సాక్ష్యమని సుశాంత్ అభిమానులు అంటున్నారు.
ఈ చిత్రంలో రియా ఓ మ్యాంగో కేక్ ను పట్టుకుని కనిపిస్తోంది. ఇది జూన్ 12న తీసినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ ఫొటోలో వెనుక కనిపిస్తున్న కిటికీ, సుశాంత్ ఇంట్లోనిదేనని గుర్తించిన ఫ్యాన్స్, సామాజిక మాధ్యమాల్లో రియాను టార్గెట్ చేసుకుని మరోసారి మండిపడుతున్నారు.

ఈ ఫొటోను బహిర్గతం చేసిన సుశాంత్ సోదరి, జూన్ 12న రియా, సుశాంత్ ఒకే చోట ఉన్నారని వ్యాఖ్యానించింది. గతంలో సుశాంత్, రియాలు తీసుకున్న ఫొటోల్లోనూ, ఈ చిత్రంలోనూ వెనుకవైపు ఒకే రకమైన కిటికీలు, గదుల రంగులు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఫొటోను అంతకుముందే తీసుకుని, ఆ రోజున పోస్ట్ చేసిందా? లేక జూన్ 12న రియా అక్కడే ఉందా? అన్న విషయమై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.

సుశాంత్ కుటుంబీకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన రియా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రదించిన వేళ, ఈ ట్విస్ట్ బయటకు రావడం గమనార్హం. కాగా, సుశాంత్ ఇద్దరు సోదరీమణుల మధ్యా జరిగిన చాట్ సంభాషణలను పరిశీలిస్తే, సుశాంత్ మానసిక స్థితి గురించిన పూర్తి సమాచారం వారికి తెలుసునని అర్థమవుతుందని రియా తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీశ్ మాన్ షిండే వ్యాఖ్యానించారు.
Rhea Chakravarthi
Sushant Singh Rajput
Sucide
June 8
Social Media

More Telugu News