Pawan Kalyan: పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజక్ట్.. అధికారిక ప్రకటన!

Surendar Reddy to direct Pawan Kalyan

  • పవన్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక ప్రకటన
  • ఎస్.ఆర్.టి బ్యానర్ పై రామ్ తాళ్లూరి ప్రాజక్ట్
  • స్క్రిప్టు అందిస్తున్న వక్కంతం వంశీ
  • విజయదశమికి పూజా కార్యక్రమాలు

ఆమధ్య చిరంజీవితో 'సైరా' వంటి భారీ చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ రోజు నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త వాస్తవమేనని వెల్లడైంది. నేడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజక్టును ప్రకటించారు.

ఈ క్రేజీ ప్రాజక్టుకు ప్రముఖ నిర్మాత, పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. తన ఎస్.ఆర్.టి బ్యానర్ పై ఆయనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన వార్తను నిర్మాత రామ్ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

అక్టోబర్ నెలాఖరులో విజయదశమి రోజున ఈ చిత్రం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆమధ్య దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్టును అందించనుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. నేడు పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన చిత్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనలు ఈ రోజు పలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News