Rashmika Mandanna: హీరోతో ప్రేమలో పడిందంటూ ప్రచారం.. స్పందించిన హీరోయిన్ రష్మిక!
- ఆ వార్తలను ఖండించిన రష్మిక
- తాను సింగిల్‌గా ఉన్నానని స్పష్టం
- ఒంటరిగా ఉండటం నచ్చిందని వ్యాఖ్య
మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పాటు నితిన్ 'భీష్మ' సినిమాల్లో నటించి వరుసగా హిట్లు కొట్టి ఖుషీగా ఉన్న హీరోయిన్ రష్మిక ఇటీవల ఓ హీరోతో లవ్ లో పడిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె ఆ వార్తలను ఖండించింది.. తనకు తెలిసిన ప్రతి యువకుడి పక్కన తన పేరును పెడుతూ ప్రచారం చేసేవారికి తాను ఓ సమాధానం చెబుతున్నానని తెలిపింది.
తాను సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేసింది. తనకు ఒంటరిగా ఉండటం నచ్చిందని చెప్పింది. జీవితంలో ఒంటరిగా, సంతోషంగా ఉండటం తెలుసుకుంటే కాబోయే జీవిత భాగస్వామిపై కూడా అంచనాలు ఇంకా పెరుగుతాయని చెప్పుకొచ్చింది. కాగా, ఈ భామ చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి.