Nithin: నితిన్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఖరారు!

Tamannah and Nabha Natesh to pair with Nithin

  • నితిన్ చిత్రంలో తమన్నా, నభా నటేశ్
  • సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో నిర్మాణం
  • దర్శకత్వం వహిస్తున్న మేర్లపాక గాంధీ

'భీష్మ' సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్ మరో సినిమాకు రెడీ అయిపోయాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ  చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితరెడ్డిలతో పాటు ఠాగుర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన తమన్నా, నభా నటేశ్ లను ఎంపిక చేసినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో టబు, రాధిక ఆప్టేలు పోషించిన పాత్రల్లో వీరు నటించనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News