Alia Bhat: జోరుగా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్.. త్వరలో అలియా భట్ రాక!

Alia Bhat joins RRR shoot soon

  • గత కొన్ని రోజులుగా 'ఆర్ఆర్ఆర్' షూట్ 
  • ఎన్టీఆర్, చరణ్ లపై సన్నివేశాల చిత్రీకరణ 
  • నవంబర్లో జాయిన్ కానున్న అలియా భట్   

'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. అయితే, లాక్ డౌన్ కారణంగా షూటింగులకు అంతరాయం కలగడంతో 'ఆర్ఆర్ఆర్' కూడా వాయిదా పడిపోయింది. కొవిడ్ నిబంధనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తిరిగి హైదరాబాద్ లో మొదలైంది.

గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్ తదితరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక చిత్రంలో చరణ్ సరసన సీత పాత్రలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ ఇంతవరకు ఈ చిత్రం షూటింగులో పాల్గొనలేదు. దీంతో ఆమె వచ్చే నెలలో ఈ చిత్రం షూట్ లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం అలియా నవంబర్ నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు.

అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందే ఆయన షూటింగులో పాల్గొనడం, ఆయన సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడం కూడా జరిగిపోయింది. ఇందులో అజయ్ సరసన ప్రముఖ నటి శ్రియ నటిస్తోంది.

  • Loading...

More Telugu News