Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kajal plans for a wedding reception in Hyderabad

  • టాలీవుడ్ మిత్రులకు కాజల్ విందు 
  • 'పుష్ప'కు బాలీవుడ్ నుంచి విలన్
  • 'జీ తెలుగు'కు 'నిశ్శబ్దం' హక్కులు  

*  ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహమాడిన అందాల తార కాజల్ త్వరలో హైదరాబాదులో పెళ్లి రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లోని తన సన్నిహితులకు కొందరికి వివాహవిందు ఇవ్వడానికి ప్లాన్ చేస్తోందట. కాగా, దీపావళి తర్వాత ఈ చిన్నది 'ఆచార్య' షూటింగులో జాయిన్ కానుంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, ఇందులో విలన్ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆ ఎంపికలో ఉన్నట్టు తెలుస్తోంది.
*  ప్రముఖ నటి అనుష్క కథానాయికగా రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, చిత్రానికి అనుకున్నంతగా ప్రేక్షకాదరణ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News