Star Maa: ప్రెస్ నోట్: ఆదివారం లవ్లీ గా స్టార్ మా !

Music Laughs Love  All in Star Maas Sunday Menu


ప్రెస్ నోట్: వారంలో ఆదివారానికో ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం ఎలా గడపాలా అని వీక్ అంతా ఆలోచిస్తుంటారు చాలా మంది. ఫ్యామిలీలో వారమంతా ఎవరెంత బిజీగా వున్నా అందరూ కలిసి ఉండేది మాత్రం ఆ ఒక్క రోజే. అలాంటి ఆదివారానికి (ఫిబ్రవరి 21న) స్టార్ మా ఓ కొత్త "మెనూ అఫ్ ఎంటర్ టైన్మెంట్" ని సిద్ధం చేసింది.
 
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ప్రయాణం "ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్ టైన్మెంట్" అందించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోణితో " స్టార్ట్ మ్యూజిక్ "ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే, ఆ వెంటనే ఒంటి గంటకు వర్షిణి తన "కామెడీ స్టార్స్" తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది.
 
ఇక సాయంత్రం 6 గంటలకు స్టార్ మా తన ప్రేక్షకుల్ని ఓ ప్రేమ ప్రపంచం లోకి తీసుకెళ్లబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ "100% లవ్". రీల్ జంటలకు, రియల్ జంటలకు మధ్య సరదా పోటీగా రాబోతున్న "100% లవ్" అందమైన "ఎక్స్ ప్రెషన్ అఫ్ లవ్" గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనసుని ఆహ్లాదపరిచే పాటలు, జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న ఎమోషనల్ మూమెంట్స్, ప్రేమను మాటల్లోకి అనువదించిన అపురూప క్షణాలు.. అన్నీ కలిసి "100% లవ్" ఈవెంట్ స్టార్ మా కుటుంబ సభ్యులందరికీ పసందైన ఓ విందు. నవ్వులు, ఆటలు, పాటలతో పాటు ప్రేమ.. స్టార్ మా ఈ ఆదివారానికి మరింత ప్రత్యేకం.
 
“100% లవ్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/9hio_Epl40M 

  • Loading...

More Telugu News