Mohan Babu: నా మనస్సు చలించిపోయింది: మోహన్ బాబు
- దర్శకుడు రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు కన్నుమూత
- కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కృష్ణమోహన్
- ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోహన్ బాబు
ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కృష్ణమోహన్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా సోదరుడు, దర్శకుడు రాఘవేంద్రరావు గారి అన్నగారు కృష్ణమోహన్ గారి మరణవార్త విని నా మనస్సు చలించిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.