Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha wants to act with Ranbhir

  • సమంత మెచ్చిన బాలీవుడ్ హీరో  
  • 'సలార్'లో మరో ప్రముఖ నటుడు
  • 'సారంగ ధరియా' మరో రికార్డు  

*  రణ్ బీర్ కపూర్ తో కలసి నటించాలని వుందంటోంది కథానాయిక సమంత. ఒకవేళ హిందీ సినిమాలలో నటించాల్సి వస్తే కనుక ఎవరితో నటిస్తారు? అని అడిగితే, ఏమాత్రం తడుముకోకుండా ఈ చిన్నది రణ్ బీర్ పేరు చెప్పింది. మరి, ఆమె కోరిక త్వరలో తీరుతుందేమో చూద్దాం.
*  ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్' యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో మంగ్లీ పాడిన 'సారంగ ధరియా' పాట ఎంతగా హిట్టయిందో మనకు తెలుసు. ఈ పాటలో సాయిపల్లవి డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ కు పైగా సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.

  • Loading...

More Telugu News