Madhya Pradesh: యువకుడి చెంపఛెళ్లుమనిపించిన అదనపు కలెక్టర్.. వీడియో ఇదిగో
- లాక్డౌన్ సమయంలో కొందరు కలెక్టర్ల అత్యుత్సాహం
- ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లో యువకుడిని కొట్టిన కలెక్టర్
- ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి
- అదనపు కలెక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి
లాక్డౌన్ సమయంలో కొందరు కలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితమే చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఓ యువకుడి స్మార్ట్ఫోను తీసుకుని దాన్ని ధ్వంసం చేసిన ఓ కలెక్టర్ అనంతరం అతడి చెంపఛెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ కలెక్టర్‌పై వేటు పడింది. ఆయన స్థానంలో మరొకరిని నూతన కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో చెప్పుల షాప్ నిర్వహిస్తున్న ఓ యువకుడిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఆమె తీరుపై తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ తెలిపారు. దర్యాప్తు జరిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.