Sharwanand: 'గూని బాబ్జీ'గా రావు రమేశ్!
- అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం'
- ప్రధాన పాత్రల్లో శర్వానంద్ - సిద్ధార్థ్
- కీలకమైన పాత్రలో రావు రమేశ్
- విలక్షణమైన నటుడిగా విపరీతమైన డిమాండ్
రావు రమేశ్ .. తెలుగు తెరపై విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్. రావు రమేశ్ డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతనే ఆయనకి అభిమానులను సంపాదించిపెట్టింది .. నటుడుగా ఆయనను నిలబెట్టేసింది. అలాంటి రావు రమేశ్ కేరక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాలోను ఆయన చేసేది వైవిధ్యభరితమైన పాత్రలే కావడం విశేషం. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.
ఈ రోజున ఆయన పుట్టిన రోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'మహా సముద్రం' సినిమాలో ఆయన పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన 'గూని బాబ్జీ' పాత్రను పోషిస్తున్నారు. ఆ పాత్రను పరిచయం చేస్తూ, ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇక ఈ పాత్రతో ఆయన 'మహా సముద్రం'ను ఎంతలా అల్లకల్లోలం చేస్తాడో చూడాలి. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే