Allu Arjun: మురుగదాస్ ప్రాజెక్టుపైనే బన్నీ దృష్టి!
- ముగింపు దశలో 'పుష్ప'
- 'ఐకాన్' కోసం వేణు శ్రీరామ్ వెయిటింగ్
- నిర్మాతగా దిల్ రాజు
- ముందుకు రానున్న మురుగదాస్ ప్రాజెక్టు
అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నాడు. కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. ఆ తరువాత ఆయన 'ఐకాన్' సినిమా చేయనున్నాడనే టాక్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 'వకీల్ సాబ్' హిట్ వల్లనే వేణు శ్రీరామ్ తో చేయడానికి బన్నీ ఒప్పుకున్నాడనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ వేరే వార్త ఒకటి షికారు చేస్తోంది.
'పుష్ప' పూర్తయిన తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం. ఆల్రెడీ గతంలోనే బన్నీకి మురుగదాస్ కథ వినిపించాడనీ, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకున్నారు. ఇప్పడు బన్నీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తున్నాడట అంతే. 'పుష్ప' పాన్ ఇండియా స్థాయి మూవీ కావడంతో, ఆ తరువాత సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉండాలనే ఉద్దేశంతో బన్నీ మనసు మార్చుకున్నాడని అంటున్నారు. అంటే వేణు శ్రీరామ్ కూడా 'ఐకాన్'ను ఆ రేంజ్ లో ఆవిష్కరించేలా కసరత్తు చేయాలన్న మాట.