Balakrishna: దసరాకి ముందుగానే 'అఖండ' రిలీజ్?
- ముగింపు దశలో 'అఖండ'
- విలన్ పాత్రలో శ్రీకాంత్
- త్వరలో షూటింగు పార్టు పూర్తి
- వినాయక చవితి తరువాతనే రిలీజ్
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు ముగింపు దశకి చేరుకుంది. కరోన వలన షూటింగు ఆగిపోయినప్పుడల్లా మిగిలిన పనులను చక్కబెడుతూ వచ్చారట. అందువలన ప్రస్తుతం చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన వర్క్ మాత్రమే పెండింగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఈ సినిమాను గడిచిన మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వలన కలిగిన అంతరాయం వలన కుదరలేదు. 'ఆర్ ఆర్ ఆర్' రావడం ఆలస్యమైతే దసరా బరిలోకి దిగాలని అనుకున్నారు. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. అయితే దసరాకి 'ఆర్ ఆర్ ఆర్' రావడం ఖరారు కావడంతో ఆలోచనలో పడ్డారు.
పోనీ 'వినాయక చవితి' కానుకగా థియేటర్లలో దింపుదామా అంటే, అప్పటికి పనులు పూర్తికావు. అందువలన ఈ సినిమాను సెప్టెంబర్ చివరివారంలో గానీ .. అక్టోబర్ మొదటివారంలోగాని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా బయటికి రావలసి ఉంది. ఇక దాదాపు ఇదే ఆలోచనలో 'ఆచార్య' టీమ్ ఉన్నట్టుగా వార్తలు వస్తుండటం ఇక్కడ కొసమెరుపు.