PellisandaD: 'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవి, వెంకటేశ్

Chiranjeevi and Venkatesh as chief guests for PellisandaD pre release event

  • శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చిత్రం
  • కథానాయికగా శ్రీలీల
  • రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వం
  • చిత్రంలో కీలకపాత్ర పోషించిన దర్శకేంద్రుడు
  • అక్టోబరు 15న థియేటర్లలో రిలీజ్
  • రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రోషన్, శ్రీలీల జంటగా గౌరి రోణంకి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పెళ్లిసందD' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 10న హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ వస్తున్నారు. 'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం షురూ కానుంది. 'పెళ్లిసందD' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News