Naveen Chandra: 'తగ్గేదే లే' నుంచి టీజర్ రిలీజ్!
- 'దండు పాళ్యం' నేపథ్యంలో మరో కథ
- దర్శకుడిగా శ్రీనివాస రాజు
- ప్రధానమైన పాత్రలో నవీన్ చంద్ర
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
'దండుపాళ్యం' గ్యాంగ్ చేసే అరాచకాల నేపథ్యంలో గతంలో 3 భాగాలుగా సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వర్గం ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను చూస్తుంటారు. దొంగతనాలు .. దోపిడీలు .. అవసరమైతే హత్యలను కూడా చాలా తేలికగా ఈ గ్యాంగ్ చేసేస్తూ ఉంటుంది.
అయితే ఇప్పటివరకూ 'దండుపాళ్యం' అనే టైటిల్ పక్కన పార్టు 1.. 2.. 3 అంటూ వేస్తూ వచ్చిన మేకర్స్, ఈ సినిమాకి 'తగ్గేదే లే' అనే టైటిల్ ను సెట్ చేయడం విశేషం. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చూపిన 'తగ్గేదే లే' అనే డైలాగ్ పాప్యులర్ కావడంతో, దానినే టైటిల్ గా పెట్టారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.
రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే క్రైమ్ కథ ఇది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. నవీంచంద్ర .. రవిశంకర్ .. మకరంద్ దేశ్ పాండే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.