Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి చేసిన దుండగుడు.. వీడియో ఇదిగో!
- దాడి నిన్న రాత్రి జరిగినట్టు సమాచారం
- సేతుపతి, ఆయన టీమ్ నడుస్తుండగా వెనుక నుంచి దాడి
- దుండగుడ్ని పట్టుకున్న సెక్యూరిటీ, పోలీసులు
ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో సేతుపతికి ఈ చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. సేతుపతి, ఆయన టీమ్ నడుస్తుండగా వెనుక నుంచి సదరు వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వెంటనే సేతుపతి టీమ్, సెక్యూరిటీ, పోలీసులు దుండగుడ్ని పట్టుకున్నారు.
అయితే అతనిపై కేసు నమోదు చేయవద్దని సేతుపతి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో సేతుపతికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.