JC Prabhakar Reddy: పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా హత్తుకున్న జేపీ ప్రభాకర్ రెడ్డి.. వీడియో ఇదిగో!

JC Prabhakar Reddy hugs Parital Sriram

  • నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
  • లోకేశ్ ను స్వాగతించేందుకు వచ్చిన జేసీ, శ్రీరామ్
  • ఒకప్పుడు రెండు కుటుంబాల మధ్య వైరం

అనంతపురం జిల్లా టీడీపీలో ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. జిల్లాలో పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం మధ్య ఒకప్పుడు వైరం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. ఈరోజు టీడీపీ నేత నారా లోకేశ్ అనంతపురంలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ ను స్వాగతించేందుకు జేపీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శ్రీరామ్ ను ప్రభాకర్ రెడ్డి ప్రేమగా హత్తుకున్నారు. ఈ సన్నివేశంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News