Pavan kalyan: 'భీమ్లా నాయక్' నుంచి రానా స్పెషల్ టీజర్?

Bheemala Nayak movie update

  • పవన్, రానా కలయికలో 'భీమ్లా నాయక్'
  • ఇగో వార్ నేపాపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 14న రానా పుట్టినరోజు
  • 20వ తేదీన సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్

పవన్ కల్యాణ్ .. రానా కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చడం విశేషం. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఇగో .. దాని తాలూకు పరిణామాలే ఈ కథ.

ఇటు పవన్ .. అటు రానా ఇద్దరి పాత్రలు కూడా నువ్వా? నేనా? అన్నట్టుగా ఆవేశంతో నడుస్తాయి. తమదే పైచేయి కావాలనే పట్టుదలతో వాళ్లు పంతాలకు పోతారు. ఇప్పటికి వరకూ వదిలిన అప్ డేట్స్ వలన ఈ విషయం ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నెల 14వ తేదీన రానా పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన కాంబినేషన్ పై కట్ చేసిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. నిత్యా మీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమాలో, సముద్రఖని .. బ్రహ్మానందం .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

  • Loading...

More Telugu News