Sri Vishnu: 'అర్జున ఫల్గుణ' నుంచి రొమాంటిక్ పోస్టర్!

Arjuna Phalguna New Poster Released

  • శ్రీవిష్ణు తాజా చిత్రంగా 'అర్జున ఫల్గుణ'
  • కథానాయికగా అమృత అయ్యర్
  • ఈ నెల 31వ తేదీన విడుదల

శ్రీవిష్ణు చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలనే చేస్తూ వెళుతున్నాడు. 'బ్రోచేవారెవరురా' సినిమా శ్రీవిష్ణు కామెడీ కూడా బాగా చేస్తాడనే పేరు తీసుకువచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన 'రాజ రాజ చోర' సినిమా, హాస్య కథలకు ఆయనను నాయకుడిని చేయవచ్చనే నమ్మకాన్ని కలిగించింది.

అలాంటి శ్రీవిష్ణు తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అర్జున ఫల్గుణ' సిద్ధమవుతోంది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో, తేజ మార్ని తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రియదర్శన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా అమృత అయ్యర్ అందాల సందడి చేయనుంది.

ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. నాయకానాయికలకు సంబంధించిన ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో నరేశ్ .. శివాజీ రాజా .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

  • Loading...

More Telugu News