Naga Chaitanya: వెబ్ సిరీస్ లో నటించనున్న నాగచైతన్య.. హీరోయిన్ ఎవరంటే..?

Naga Chaitanya acting in web series

  • నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న నాగచైతన్య
  • చైతూ సరసన నటిస్తున్న ప్రియా భవానీ శంకర్
  • హారర్ పాత్రను చైతూ పోషిస్తుండటం ఇదే తొలిసారి

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. ఈ చిత్రంతో మరో హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం 'థాంక్యూ', 'బంగార్రాజు' సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు తొలిసారి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కి ఇంకా టెటిల్ నిర్ణయించలేదు. ఈ నెల చివరి వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో 24 నుంచి 30 ఎపిసోడ్స్ ఉండనున్నట్టు సమాచారం. ఇందులో నాగచైతన్య సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనుంది. హారర్ కథాంశంతో ఈ సిరీస్ ను నిర్మించనున్నారు. నాగచైతన్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించబోతున్నాడు. హారర్ కథలో నాగచైతన్య నటిస్తుండటం ఇదే తొలిసారి. కథ నచ్చడంతో నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ కు ఒప్పుకున్నాడు.

  • Loading...

More Telugu News