Abhiram: 'మానాడు' రీమేక్ లో రానా సోదరుడు!
- తమిళంలో హిట్ కొట్టిన 'మానాడు'
- రీమేక్ హక్కులు సురేశ్ బాబు చేతిలో
- తేజ సినిమాతో అభిరామ్ బిజీ
- ఆ వెంటనే 'మానాడు' రీమేక్ పనులు
ఇటీవల శింబు కథానాయకుడిగా తమిళంలో 'మానాడు' సినిమా రూపొందింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటించాడు. హీరోకి .. విలన్ కి మధ్య జరిగే మైండ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.
తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు. తెలుగు వెర్షన్ కి 'ది లూప్' అనే టైటిల్ ను ఖరారు చేసి, రిలీజ్ కి రెడీ చేసి ఆగిపోయారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసుకోవడం వలన, తెలుగు డబ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేశారట.
ఈ నేపథ్యంలో శింబు పాత్రలో రానా కనిపిస్తాడనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను తీసుకున్నది రానా కోసం కాదట. ఆయన సోదరుడు అభిరామ్ తో చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే 'మానాడు' రీమేక్ మొదలవుతుందని అంటున్నారు.