Bheemla Naik: భీమ్లా నాయక్ కూడా ఫిబ్రవరి 25నే... రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం

- పవన్ కల్యాణ్ హీరోగా భీమ్లా నాయక్
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం
- మాటలు అందించిన త్రివిక్రమ్
- పవన్ సరసన నిత్యా మీనన్
- పవర్ఫుల్ విలన్ గా రానా
- గతంలో రెండు విడుదల తేదీలు ప్రకటించిన చిత్రబృందం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టయిన్ మెంట్స్ నిర్ధారించింది. ఇటీవల భీమ్లా నాయక్ కోసం రెండు విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25న, లేకపోతే ఏప్రిల్ 1న వస్తామని చిత్రబృందం వెల్లడించింది. అయితే, ఫిబ్రవరి 25నే భీమ్లానాయక్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం నేడు కన్ఫర్మ్ చేసింది.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయిక. ప్రతినాయకుడిగా రానా నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. తమన్ స్వరకల్పనలో వచ్చిన భీమ్లా నాయక్ పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి ఇది రీమేక్ గా రూపుదిద్దుకుంది.
కాగా, వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం కూడా ఫిబ్రవరి 25న వస్తుండడం తెలిసిందే. గని చిత్ర యూనిట్ కూడా ఇవాళే రిలీజ్ డేట్ ప్రకటించింది.