Nikhil: '18 పేజెస్' నుంచి అనుపమ స్పెషల్ పోస్టర్!

18 Pages special poster released

  • ఈ రోజున అనుపమ బర్త్ డే
  • యూత్ లో ఆమెకి మంచి క్రేజ్
  • రిలీజ్ కి రెడీగా '18 పేజెస్'
  • లైన్లోనే ఉన్న 'కార్తికేయ 2'

తెలుగు తెరపై ఆకర్షణీయమైన కళ్లతో ఆకట్టుకున్న కథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే వరుసగా మూడు సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఆ జాబితాలో 'అ ఆ' .. 'ప్రేమమ్' .. 'శతమానం భవతి' కనిపిస్తాయి. నానీతో చేసిన 'కృష్ణార్జున యుద్ధం' ఆమెకి మరింత పేరు తీసుకొచ్చింది.

ఆ తరువాత చేసిన సినిమాలు ఆమె కెరియర్ కి అంతగా ఉపయోగపడలేదు. చివరగా చేసిన 'రాక్షసుడు' హిట్ అయినా అది ఆమె ఖాతాలోకి చేరలేదు. అందుకు కారణం ఆ సినిమాలో ఆమె కథానాయిక స్థానంలో కనిపించకపోవడమే. ఇక ఇప్పుడు ఆమె నుంచి రానున్న సినిమాగా '18 పేజెస్' కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 - సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఈ సినిమాలో ఆమె నిఖిల్ జోడీగా కనిపించనుంది. ఈ రోజున అనుపమ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆమెకి గ్రీటింగ్స్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. యూత్ ను ఆకట్టుకునేదిలానే ఈ పోస్టర్ ఉంది. ఇక ఆ తరువాత సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి 'కార్తికేయ 2' కూడా రెడీగానే ఉంది.

  • Loading...

More Telugu News