Seemantham: పెనుగొండలో మహిళా కానిస్టేబుల్ కు సీమంతం చేసిన ఇతర పోలీసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- గర్భం ధరించిన కానిస్టేబుల్ లీలారాణి
- పోలీస్ స్టేషన్ లోనే సీమంతం
- హాజరైన సీఐ, ఎస్సై
సగటు మహిళ జీవితంలో వివాహం, గర్భధారణ, సీమంతం, మాతృత్వం అనేవి ఎంతో ముఖ్యమైన అంశాలు. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ గర్భం ధరించింది. తమ సహచర కానిస్టేబుల్ తల్లి కాబోతున్న తరుణంలో ఇతర పోలీసులు ఆమెకు నిండు మనసుతో సీమంతం జరిపించారు.
ఆ మహిళా కానిస్టేబుల్ పేరు లీలారాణి. ప్రసవ సమయం సమీపిస్తుండడంతో ఆమెకు పోలీస్ స్టేషన్ లోనే సీమంతం చేశారు. లీలారాణి సీమంతం కోసం పోలీస్ స్టేషన్ ను అందంగా ముస్తాబు చేశారు. ఆశీస్సుల కోసం ముత్తయిదువలు, పేరంటాళ్లను కూడా ఆహ్వానించారు. ఈ సీమంతం పనులను పెనుగొండ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై మోహన్ రావు స్వయంగా పర్యవేక్షించడం విశేషం.