Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై తొలిసారిగా స్పందించిన రష్మిక మందన్న
- పెళ్లి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి
- ఇలాంటి పుకార్లు నాకు కొత్తేమీ కాదు
- వీటిని పట్టించుకునే సమయం కూడా నాకు లేదు
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని, ఇలాంటి పుకార్లు తనకు కొత్తేమీ కాదని తెలిపింది. ఇలాంటి వార్తలను విని నవ్వుకోవడం అలవాటయిందని చెప్పింది. వీటిని పట్టించుకునే సమయం కూడా తనకు లేదని తెలిపింది.
మరోవైపు రష్మిక వ్యాఖ్యలపై నెటిజన్లు మరో విధంగా స్పందిస్తున్నారు. మీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా లేకపోయినప్పటికీ... మీరిద్దరూ ముంబైకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. మీతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా ఎవరూ లేరు కదా? అని ప్రశ్నిస్తున్నారు.