Botsa Satyanarayana: ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు తీర్పుపై బొత్స అసహనం
- రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
- అసెంబ్లీ ఉన్నదే చట్టాలు చేయడానికన్న బొత్స
- తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులని స్పష్టీకరణ
కోర్టు తీర్పు అధికార పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంటు ఉన్నవే చట్టాలు చేయడానికని అన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులని అన్నారు. తాము సమాజం కోసం ఆలోచన చేస్తుంటే, టీడీపీ తమ సామాజికవర్గం కోసం ఆలోచిస్తుందని విమర్శించారు.