Kiran Abbavaram: 'సమ్మతమే' నుంచి 'బుల్లెట్టులా ..' సాంగ్ రిలీజ్!

Sammathame Lyrical Song Released

  • మరో ప్రేమకథా చిత్రంగా 'సమ్మతమే'
  • కిరణ్ అబ్బవరం జోడీగా చాందిని 
  • సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 

కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'సెబాస్టియన్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పెద్దగా గ్యాప్ లేకుండా 'సమ్మతమే' సినిమాను వదలడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి గోపీనాథ రెడ్డి దర్శకత్వం వహించాడు.

కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. 'బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే' అంటూ ఈ పాట సాగుతోంది. హీరోయిన్ ప్రేమలో పడిపోయిన హీరో ఆమె ప్రతి కదలికను ప్రత్యేకంగా చూస్తుంటాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తుంటాడు. ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది. 

శేఖర్ చంద్ర సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటకి సామ్రాట్ సాహిత్యాన్ని అందించగా రితేశ్ ఆలపించాడు. కిరణ్  అబ్బవరం జోడీగా చాందినీ చౌదరి నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News