Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన సమంత?

Samantha in Shirva Nirvana Movie

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'శాకుంతలం'
  • షూటింగు దశలో 'యశోద'
  • శివ నిర్వాణకి గ్రీన్ సిగ్నల్ అంటూ టాక్ 
  • గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'మజిలీ'     

విజయ్ దేవరకొండ జోడీగా సమంత ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేననే టాక్ బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం 'లైగర్' షూటింగులో ఉన్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత సినిమాను శివ నిర్వాణతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీని తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, సమంతను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చైతూ - సమంత కాంబినేషన్లో 'మజిలీ' వంటి హిట్ ఇచ్చింది శివ నిర్వాణనే. అందువలన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. 

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరపై గొప్పగా ఆవిష్కరించగలడనే పేరున్న శివ నిర్వాణ, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 'యశోద' తరువాత తెలుగులో సమంత చేస్తున్న సినిమా ఇది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News