Arjun: అర్జున్ 'జెంటిల్ మేన్'కి సీక్వెల్ .. హీరోయిన్ గా నయనతార!

Nayanatara in Gentleman 2 Movie

  • 1993లో వచ్చిన 'జెంటిల్ మేన్'
  • సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా 
  • మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ టాక్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి?  

1990లలో వచ్చిన భారీ సినిమాలలో .. భారీ విజయాలను సాధించిన సినిమాలలో 'జెంటిల్ మేన్' ఒకటి. కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించాడు. అర్జున్ హీరోగా మధుబాల నాయికగా నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఒక ఊపు ఊపేసింది. అటు అర్జున్ .. ఇటు శంకర్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.

ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా మ్యుజికల్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేశారుగానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆ సినిమా సీక్వెల్ విషయం తెరపైకి వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ తీయడానికి కుంజుమోన్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 

కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇక సంగీత దర్శకుడిగా కీరవాణితో మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఈ టాక్ వినిపిస్తోంది. శంకర్ ఇప్పట్లో తీరిక చేసుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో దర్శకుడిగా ఆయనే ఉంటాడా? లేదంటే వేరే డైరెక్టర్ ను ఎంపిక చేసుకుంటారా? అనేది చూడాలి.

  • Loading...

More Telugu News