Nitin Gadkari: దేశంలో తొలి హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు విచ్చేసిన మంత్రి గడ్కరీ
- టయోటా మిరాయ్ కారులో ప్రయాణం
- భవిష్యత్తు అంతా గ్రీన్ హైడ్రోజన్ దే
- భారత్ స్వీయ సమృద్ధికి ఇది కీలకం
- కిలోమీటర్ కు కేవలం రూ.1.50 ఖర్చు
- ప్రకటించిన కేంద్ర మంత్రి
పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత తొలి దేశీయ కారులో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. టయోటా మిరాయ్ పేరుతో ఇటీవలే దేశీయంగా తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత కారును టయోటా ఆవిష్కరించింది. ఈ కారులో తన నివాసం నుంచి పార్లమెంట్ కు బుధవారం మంత్రి గడ్కరీ ప్రయాణించారు.