Casting Call: మీకు ప్రభాస్ కొత్త సినిమాలో నటించాలనుందా... అయితే ఇది చదవండి!

Casting Call for Prabhas new movie
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్
  • 'ప్రాజెక్ట్ కే'  కోసం ఆడిషన్స్
  • నేడు, రేపు ఎంపికలు
  • హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఎరీనా వేదికగా సెలెక్షన్స్
  • ప్రకటన ఇచ్చిన వైజయంతీ మూవీస్
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ సినిమాలో నటించేందుకు కొత్త వాళ్లకు అవకాశమివ్వడం మామూలు విషయం కాదు. కానీ, వైజయంతీ మూవీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'ప్రాజెక్ట్ కే' చిత్రంలో నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకు కొత్త వాళ్లు కావాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ క్యాస్టింగ్ కాల్ ఇచ్చింది. "భవిష్యత్తు తారలు మీరే" అంటూ అన్ని వివరాలతో సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. 

అన్ని వయసుల వారు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని వెల్లడించింది. నటులు, మోడల్స్, డ్యాన్సర్లు, మ్యూజిషియన్లు, మార్షల్ ఆర్టిస్ట్స్, పెర్ఫార్మెర్స్ ఎవరైనా రావొచ్చని పేర్కొంది. తమ ప్రతిభను ఓ 30 సెకన్ల పాటు ప్రదర్శించేలా సన్నద్ధమై రావాలని పిలుపునిచ్చింది. హైదరాబాదులోని ఫీనిక్స్ ఎరీనా (టీఎస్ఐఐసీ పార్క్-హైటెక్ సిటీ) వేదికగా ఆడిషన్స్ జరుగుతాయని వైజయంతీ మూవీస్ తన ప్రకటనలో వెల్లడించింది. 

ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఈ నెల 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
Casting Call
Prabhas
Project-K
Vyajayanthi Movies
Auditions
Hyderabad
Tollywood

More Telugu News