Pooja Mishra: కూతురు సోనాక్షి కోసం నన్ను వ్యభిచారిగా మార్చాడు... శత్రుఘ్నసిన్హాపై సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి

Pooja Mishra makes sensational allegations in Shatrughan Sinha
  • సోనాక్షి కోసం తన కన్యత్వం అమ్మేశాడన్న పూజా మిశ్రా
  • 17 ఏళ్లుగా వాడుకుంటున్నారని వెల్లడి
  • చేతబడి చేయించిన ఆహారం తినిపించారని ఆరోపణ
  • తనను వేశ్యగా మార్చారని వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి పూజా మిశ్రా సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. శత్రుఘ్నసిన్హా తన కుమార్తె సోనాక్షి సిన్హా భవిష్యత్తు కోసం తన కన్యత్వాన్ని అమ్మేశాడని, తనను వ్యభిచారిగా మార్చాడని పూజా మిశ్రా వెల్లడించింది. ఫ్యాషన్ డిజైనర్ గానే ఉండిపోవాల్సిన కుమార్తె సోనాక్షి కోసం తన జీవితాన్ని బలిచ్చారని తెలిపింది. తన తండ్రి, శత్రుఘ్నసిన్హా స్నేహితులని, శత్రుఘ్నసిన్హాకు తన తండ్రి కోట్ల రూపాయల డబ్బు కూడా ఇచ్చాడని తెలిపింది. 

అయితే, శత్రుఘ్నసిన్హా కుటుంబం తనను 17 ఏళ్లుగా  వాడుకుంటోందని, తనపై చేతబడి ప్రయోగించారని, తద్వారా వేశ్యగా మార్చారని వివరించింది. ఓసారి శత్రుఘ్నసిన్హా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లానని, అయితే ఆయన భార్య పూనమ్ తనకు చేతబడి చేయించిన ఆహార పదార్థాలు తినిపించిందని పూజా మిశ్రా ఆరోపించింది. అవి తినగానే తాను శరీరంపై అదుపు కోల్పోయానని, అప్పటినుంచి ప్రతిసారి చేతబడి ద్వారా తనతో వ్యభిచారం చేయించేవారని పేర్కొంది. 

శత్రుఘ్న సిన్హా, పూనమ్ తన కెరీర్ నాశనం చేశారని, స్టార్ హీరోయిన్ కాకుండా అడ్డుపడ్డారని ఆరోపించింది. వారి వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయానని వివరించింది.
Pooja Mishra
Shatrughan Sinha
Sonakshi Sinha
Poonam Sinha
Bollywood

More Telugu News