Kishan Reddy: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు భేటీ

manchu vishnu meets union minister kishan reddy

  • హైద‌రాబాద్‌లో జ‌రిగిన భేటీ
  • భేటీకి గ‌ల కార‌ణాలు వెల్ల‌డి కాని వైనం
  • భేటీ గురించి వెల్లడించిన కిష‌న్ రెడ్డి కార్యాలయం 

కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడార‌న్న వివ‌రాలు మాత్రం వెల్ల‌డి కాలేదు. మంచు విష్ణు త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కార్యాలయం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ భేటీకి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News