TDP: నారా లోకేశ్ చేతుల్లో భూమా అఖిలప్రియ కుమారుడు!
- ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన అఖిలప్రియ
- కుమారుడితో కలిసి లోకేశ్ ను కలిసిన అఖిల
- అఖిలప్రియ కుమారుడిని ముద్దు చేసిన లోకేశ్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
టీడీపీ యువ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీకి వచ్చిన సందర్భంగా ఆమె తన కుమారుడిని తన వెంటే తీసుకువచ్చారు. అఖిలప్రియ కుమారుడిని తన చేతుల్లోకి తీసుకున్న లోకేశ్... ఆ చిన్నారిని ముద్దు చేశారు. ఈ ఫొటోలను అఖిలప్రియ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అంతేకాకుండా తన కుమారుడు తమ భేటీని డిస్టర్బ్ చేశాడంటూ ఓ కామెంట్ కూడా పోస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం భార్గవ్ రామ్ ను అఖిలప్రియ వివాహమాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇటీవలే మగబిడ్డ జన్మించాడు.