Sushmita Sen: పెళ్లి కాలేదు, ఎంగేజ్‌మెంటూ కాలేదు!...ల‌లిత్ మోదీ ట్వీట్ల‌పై సుస్మితా సేన్ క్లారిటీ!

Sushmita Sen clarity on lalit modi tweets

  • సుస్మిత‌తో డేటింగ్‌లో ఉన్నాన‌ని ల‌లిత్ మోదీ ట్వీట్‌
  • ఏదో ఒకరోజు పెళ్లి జరిగితీరుతుందన్న లలిత్  
  • డేటింగ్‌పై మాత్రం నోరు విప్ప‌ని బాలీవుడ్ న‌టి
  • ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని చెప్పిన సుస్మిత 

కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు విదేశాల‌కు పారిపోయిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మాజీ బాస్ ల‌లిత్ మోదీ గురువారం రాత్రి పోస్ట్ చేసిన ట్వీట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌నంగా మారాయి. మాజీ విశ్వ సుంద‌రి, బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్‌తో త‌న నూత‌న జీవితం ప్రారంభ‌మైంద‌ని, ప్ర‌స్తుతం తామిద్ద‌రం డేటింగ్‌లో ఉన్నామ‌ని, పెళ్లి కూడా ఏదో ఒక రోజు జ‌రిగి తీరుతుందంటూ మోదీ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ట్వీట్ల‌పై శుక్ర‌వారం సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది.

ల‌లిత్ మోదీ పేరును ప్ర‌స్తావించ‌కుండా అస‌లు విష‌యాన్ని సూటిగా చెప్పేసిన సుస్మిత... త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని, క‌నీసం ఎంగేజ్ మెంట్ కూడా కాలేద‌ని వెల్ల‌డించింది. తాను ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాన‌ని కూడా ఆమె తెలిపింది. ఈ వ్య‌వ‌హారంపై తాను పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఇచ్చినట్టుగానే భావిస్తున్నాన‌ని ఆమె పేర్కొంది. అయితే ల‌లిత్ మోదీ కూడా తాను ఇప్ప‌టిదాకా పెళ్లి చేసుకోలేద‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే. తామిద్ద‌రం డేటింగ్‌లో ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే పెళ్లి, ఎంగేజ్‌మెంట్ల‌పై క్లారిటీ ఇచ్చిన సుస్మిత డేటింగ్‌పై మాత్రం నోరు విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News