Raviteja: 'ధమాకా' నుంచి ఫస్టు సింగిల్.. మాస్ బీట్ తో సాగే పాట!
- రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా అలరించనున్న శ్రీలీల
- త్వరలో వెలువడనున్న రిలీజ్ డేట్ ప్రకటన
రవితేజను మాస్ మహారాజ్ అంటారు .. త్రినాథరావు నక్కినకి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబోగా వచ్చిన యాక్షన్ సినిమానే 'ధమాకా'. భారీ బడ్జెట్ తో విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
రవితేజ సరసన నాయికగా శ్రీలీల నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ప్లే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "నిన్ను సూడబుద్దయితుంది రాజీగో .. మాట్లాడబుద్దయితుంది రాజీగో" అంటూ జానపద బాణీలో ఈ సాంగ్ సాగుతోంది. బీమ్స్ సంగీతాన్ని అందించగా .. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చాడు. బీమ్స్ - మంగ్లీ కలిసి ఈ పాటను ఆలపించారు.
బీట్ బాగుంది .. దానికి తగిన పదాలను కాసర్ల శ్యామ్ వేశాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి అందించిన కొరియోగ్రఫీ బాగుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మాస్ బీట్లలో ఒకటిగా ఈ పాటను గురించి చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. రెండు ఫ్లాపులతో ఉన్న రవితేజకి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.