Pharmexcil: నకిలీ దగ్గు మందుల కంపెనీకి ఫార్మెగ్జిల్ షాక్
- ఫార్మెగ్జిల్ సభ్యత్వం నిలిపివేత
- దీంతో ఎగుమతి ప్రోత్సాహకాలు అందని పరిస్థితి
- చిన్నారుల మరణాలపై వివరాలు ఇవ్వడంలో విఫలం కావడంతో ఈచర్య
నకిలీ దగ్గు, జలుబు మందులను తయారు చేసి, గాంబియా దేశానికి చెందిన 66 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమైన హర్యానా ఫార్మా కంపెనీ మెయిడెన్ ఫార్మాస్యూటికల్ కు ఫార్మెగ్జిల్ షాకిచ్చింది. ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఫార్మెగ్జిల్ గా చెబుతారు. ఫార్మా రంగ ఎగుమతులకు సంబంధించి అత్యున్నత మండలి ఇది. ఈ సంస్థ మెయిడెన్ ఫార్మా సభ్యత్వాన్ని నిలిపివేసింది. దీంతో మెయిడన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఎగుమతి ప్రోత్సాహకాలు రావు. మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ పథకం కింద ప్రోత్సాహకాలకు అర్హత కోల్పోయినట్టు అయింది.