Kajal Aggarwal: పేరెంట్స్ క్లబ్ లోకి నయన్, విఘ్నేశ్ కు ఆహ్వానం: కాజల్ అగర్వాల్
- గర్భాన్ని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులుగా మారిన నయన్, విఘ్నేశ్
- చాలా చాలా శుభాకాంక్షలు అంటూ కాజల్ అగర్వాల్ పోస్ట్
- పెళ్లయిన నాలుగు నెలలకే పుత్రోత్సాహం
నయనతార, విఘ్నేశ్ శివన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ నడుస్తోంది. పెళ్లయిన సరిగ్గా నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులు అయ్యారు. అక్టోబర్ 9న సరోగసీ విధానంలో (వేరొకరి గర్భం సాయంతో) కవలలకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్ 9న చెన్నైలో నయన్, విఘ్నేశ్ వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లికి ముందే పిల్లలకు ప్లాన్ చేసుకోవడంపై వీరిని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తుంటే, కొందరు తల్లిదండ్రులైన ఈ జంటను శుభాకాంక్షలతో అభినందిస్తున్నారు. నటి కాజల్ అగర్వాల్ కూడా తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో శుభాకాంక్షలు తెలియజేసింది.