Charan: చరణ్ - శంకర్ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ అదే రోజున ఉంటుందట!

Charan and Shankar movie update

  • షూటింగు దశలో చరణ్ 15వ సినిమా 
  • రాజమండ్రి పరిసరాల్లో జరుగుతున్న చిత్రీకరణ 
  • దీపావళికి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ 
  • వచ్చే ఏడాదిలో థియేటర్లకు రానున్న సినిమా   

చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ పవర్ఫుల్ గా ఉండేలా చూస్తున్నారట. ఆల్రెడీ టైటిల్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారనీ, దీపావళి రోజున టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. దాదాపు ఆ రోజున టైటిల్ బయటికి వచ్చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కియారా అద్వాని కనిపించనున్న సంగతి తెలిసిందే. 

పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చరణ్ ప్రాజెక్టు ఏ దర్శకుడితో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News