Vishwanth: కళ్లలోన కన్నీరై జారే హృదయం: 'బోయ్ ఫ్రెండ్' నుంచి మనసును తాకే సాంగ్!
- రేపు విడుదలవుతున్న 'బోయ్ ఫ్రెండ్'
- ప్రేమకథాంశమే ప్రధానమైన ఇతివృత్తం
- కథానాయికగా మాళవిక పరిచయం
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
తెలుగు ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. అలాంటి ఓ ప్రేమకథా చిత్రమే 'బోయ్ ఫ్రెండ్'. విశ్వంత్ - మాళవిక జంటగా నటించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి - వేణు మాధవ్ నిర్మించారు. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కళ్లలోన కన్నీరై జారే హృదయం .. నమ్మకాలే వమ్మైపోయేటి నిమిషం, ఒక తీయని స్నేహం చెంతచేరి ఆశలే పెంచె నాలో .. కనిపించని గాయం గుండెలో రేగి విసిరివేసింది నిశిలో' అంటూ ఈ పాట సాగుతోంది.
గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాట ఎమోషనల్ గా నడుస్తుంది. హీరో .. హీరోయిన్ మధ్య పరిచయం .. ప్రేమ .. ఎడబాటు .. ఆవేదన నేపథ్యంలో నడిచే పాట ఇది. యూత్ కనెక్ట్ అయ్యే ప్రేమకథతో రేపు థియేటర్లలో దిగిపోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.