Hubble Telescope: సూర్యుడి కంటే వందల రెట్లు పెద్దదైన నక్షత్రంలో భారీ విస్ఫోటనం... గుర్తించిన హబుల్ టెలిస్కోప్

Hubble space telescope captures huge explosion of a giant star

  • అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న హబుల్ టెలిస్కోప్
  • పేలిపోయిన నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది 
  • మృతనక్షత్రంగా మారిన వైనం
  • రికార్డు చేసిన హబుల్ టెలిస్కోప్

భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ అంతరిక్షంలోని అద్భుత ఘట్టాలను ఆవిష్కరిస్తున్న నాసా హబుల్ టెలిస్కోప్ మరో కీలక దృశ్యాన్ని గుర్తించింది. పరిమాణంలో సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదైన ఓ నక్షత్రంలో సంభవించిన భారీ విస్ఫోటనాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. 

ఈ నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది. ఇది విస్ఫోటనం (సూపర్ నోవా) చెందుతూ, దానిలోని వాయువులను విశ్వంలోకి వ్యాపింపజేస్తూ మృత నక్షత్రంగా మారిపోయింది. ఈ సూపర్ నోవా 11 వందల కోట్ల సంవత్సరాల నాటి పేలుడు అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

ఆ నక్షత్రం బాహ్యవాతావరణ పొరలు అన్నీ గ్యాస్ మయం అని, ఈ పొరలు భగ్గుమని మండిపోయి విశ్వాంతరాళాల్లోకి వ్యాపించినట్టు హబుల్ టెలిస్కోప్ రికార్డు చేసిన డేటా చెబుతోంది. 

హబుల్ టెలిస్కోప్ ఈ సూపర్ నోవాను ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు చిత్రాలుగా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన అధ్యయనం తాజాగా జర్నల్ నేచుర్ అనే పత్రికలో ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News