Raviteja: రవితేజ 'ధమాకా' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా'
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా అలరించనున్న శ్రీలీల
- డిసెంబర్ 23వ తేదీన సినిమా రిలీజ్
రవితేజ, శ్రీలీల జంటగా 'ధమాకా' సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించాడు. యూత్ కీ .. మాస్ కి కావాల్సిన కంటెంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే అంశాలను కలపడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఈ సినిమాకి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఇంతవరకూ వదిలిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ సాగే మూడో లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'సింగిల్ గానే ఉంటా ఏ లవ్ లో పడకుండా అని అనుకున్న మాట ఏమయ్యిందో, అబ్బాయిలతో కాస్త అమ్మాయి జాగ్రత్త అని నాన్నన్న మాట ఏమైపోయిందో' అంటూ ఈ పాట నడుస్తోంది.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను రమ్య బెహ్రా - భార్గవి పిళ్లై ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. హీరో తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత తనలో కలిగిన మార్పులను హీరోయిన్ ఆవిష్కరించే పాట ఇది. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.