Kodali Nani: చంద్రబాబు మాటలను మాచర్ల టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని ఉంటారు: కొడాలి నాని

Kodali Nani opines on Macherla clashes

  • మాచర్లలో తీవ్ర ఉద్రిక్తతలు
  • టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
  • రాజకీయాల్లో ఇవి సహజమేనన్న నాని

పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వైసీపీ నేతలను బట్టలిప్పి కొడతానని చంద్రబాబు ప్రతి సభలోనూ అంటుంటారని, మాచర్ల టీడీపీ నేతలు చంద్రబాబు మాటలను ఆదర్శంగా తీసుకుని ఉంటారేమో.... అందువల్లే అక్కడ గొడవ జరిగి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. 

రాజకీయాలన్న తర్వాత ఇలాంటి గొడవలు సహజమేనని, ఇవి జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇవే మొదటి గొడవలు కావు, ఇవే చివరి గొడవలూ కావు అని వివరించారు.  

  • Loading...

More Telugu News