Balakrishna: 'వీరసింహారెడ్డి' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ .. చూసేయండి!

Veera Simha Reddy Movie Making Video Release

  • 'వీరసింహా రెడ్డి'గా పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ 
  • ఆయన జోడీకట్టిన శ్రుతి హాసన్
  • రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ  
  • ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన తమన్ సంగీతం 
  • జనవరి 12వ తేదీన విడుదలవుతున్న సినిమా

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, బాలయ్య సరసన శ్రుతి హాసన్ అలరించనుంది. తమన్ నుంచి వచ్చిన మాస్ బీట్స్ కి ఇప్పటికే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం మేకింగ్ వీడియోను వదిలారు. బాలయ్య యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్ చిత్రీకరణకి సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలోని బిట్స్ తో మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగు చూడటానికి వచ్చిన బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నారు.  

బాలకృష్ణ ఇంతకుముందు చేసిన ఫ్యాక్షన్ సినిమాలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News