Raviteja: మరింత పెరిగిన 'ధమాకా' జోరు .. 77 కోట్ల వసూళ్లు!
- డిసెంబర్ 23న వచ్చిన 'ధమాకా'
- మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న కథ ఇది
- వసూళ్ల పరంగా తగ్గని జోరు
- 100 కోట్ల మార్క్ దిశగా వెళుతున్న సినిమా
రవితేజ - శ్రీలీల జంటగా నక్కిన త్రినాథరావు రూపొందించిన 'ధమాకా' క్రితం నెల 23వ తేదీన విడుదలైంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో, రవితేజ నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువలన ఈ సినిమా ఒక రేంజ్ లో వారికి కనెక్ట్ అయింది.
తొలి మూడు రోజుల్లోనే 30 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ ఆదివారంతో కలుపుకుని 75 కోట్ల మార్కును అందుకోవచ్చని అనుకున్నారు. కానీ నిన్నటి వసూళ్లతోనే ఈ సినిమా 77 కోట్ల మార్కును దాటేసింది. 9వ రోజైన నిన్న, అనుకున్నదానికంటే వసూళ్లు పెరిగాయి. ఈ రోజుతో ఈ సినిమా 80 కోట్ల మార్కును దాటేసే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఈ వారం విడుదలైన సినిమాల్లో 'ధమాకా'తో పోటీపడేవి ఏమీ లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. సక్సెస్ మీట్ లో హారీశ్ శంకర్ చెప్పినట్టు, ఈ సినిమా జోరు సంక్రాంతి వరకూ కొనసాగేలా కనిపిస్తోంది .. 100 కోట్ల మార్కును టచ్ చేసేదిలానే అనిపిస్తోంది.