Laya: ఆ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది: సీనియర్ హీరోయిన్ లయ
- సంప్రదాయబద్ధమైన పాత్రలను చేస్తూ వచ్చిన లయ
- మంచిపేరు తెచ్చిపెట్టిన 'ప్రేమించు'
- ఆ సినిమా చేయొద్దన్నారని వెల్లడి
- 'మా బాలాజీ' చేయడం పొరపాటేనని వ్యాఖ్య
తెలుగు తెరపై అందంగా .. పద్ధతిగా మెరిసిన కథానాయికగా లయ కనిపిస్తుంది. దాదాపు ఏడేళ్లలోనే 30 సినిమాలకి పైగా చేసిన ఆమె, వివాహం తరువాత నుంచి నటనకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ .. "హీరోయిన్ గా నా మొదటి సినిమా 'స్వయంవరం'. అప్పటికి త్రివిక్రమ్ ఇంకా దర్శకుడు కాలేదు .. సునీల్ ఆర్టిస్ట్ కాలేదు" అని అన్నారు.
"కె.విశ్వనాథ్ గారు .. కోడి రామకృష్ణగారు .. సీనియర్ వంశీ గారు .. ఈవీవీ గారు .. ఎస్వీ కృష్ణారెడ్డిగారు వంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డిగారితో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం నా దురదృష్టం. కాకపోతే వాళ్లతో కలిసి పనిచేయడమే ఒక అందమైన జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పారు.
'ప్రేమిస్తే' సినిమాలో అంధురాలి పాత్రను చేయవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. అలాంటి పాత్రలు చేస్తే కెరియర్ దెబ్బతింటుందని అన్నారు. అయినా అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయని భావించి చేశాను. మంచి పేరుతో పాటు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక నా కెరియర్లో ఫలానా సినిమా చేసి ఉండకపోతే బావుండుననే సినిమా ఏదైనా ఉందంటే, అది 'మా బాలాజీ' సినిమానే. ఎలాంటి సినిమాలను .. పాత్రలను ఒప్పుకోవాలనే విషయం తెలియకపోవడం వలన ఆ పొరపాటు జరిగింది" అని చెప్పుకొచ్చారు.